సుదీర్ఘ విరామం తర్వాత..న్యూజిలాండ్ ఘనవిజయం

సుదీర్ఘ విరామం తర్వాత..న్యూజిలాండ్ ఘనవిజయంవరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : 18 యేండ్ల సుదీర్ఘ విరామం అనంతరం న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికాపై టెస్ట్ మ్యాచ్ నెగ్గింది. 3 రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 276 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 95 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 482 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో సఫారీ జట్టు 111 పరుగులకే పరిమితమైంది.టెంబా బవుమా (41) టాప్ స్కోరర్ గా నిలువగా, కివీస్ బౌలర్లో సీనియర్ పేసర్ సౌథీ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో సఫారీ జట్టును కుప్పకూల్చిన న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ( 7/23 )కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.