న్యూజిలాండ్ పై భారత్ భారీ గెలుపు 

న్యూజిలాండ్ పై భారత్ భారీ గెలుపు

న్యూజిలాండ్ పై భారత్ భారీ గెలుపు 

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ మరియు భారత్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ దిగిన భారత్ 234 భారీ స్కోర్ చేయడం జరిగింది. ఓపెనర్ శుభమన్ గిల్ 126 పరుగులు చేయడంతో పాటు మిగతా బ్యాట్స్ మెన్ లు కూడా భారీ స్కోరు చేయడం జరిగింది. ఈ క్రమంలో 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 66 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.

భారత బౌలర్ ల దాటికి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లు కుప్పకూలిపోయారు. ఎవరు కూడా క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో 168 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంతో మూడో టీ20 సిరీస్ ని 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. భారత్ బౌలర్ లలో హార్దిక్ పాండ్యా నాలుగు టికెట్లు, ఉమ్రాన్ 2 వికెట్లు, మావి రెండు వికెట్లు, అర్ష్ దీప్ రెండు వికెట్లు తీయడం జరిగింది.