మృతులకు కరోనా పరీక్షలు సాధ్యం కాదు: ఈటల

హైదరాబాద్‌: మృతి చెందిన వారికి కొవిడ్‌ పరీక్షలు చేయాలనడం అశాస్త్రీయమైనదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. మృతులందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడినవారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. కరోనా సోకిన వారందరినీ బతికించేందుకు మృతులకు కరోనా పరీక్షలు సాధ్యం కాదు: ఈటలఅన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ‘‘చనిపోయిన వారికి కొవిడ్‌ పరీక్షలు చేయాలనడం అవగాహన రాహిత్యంతో కూడుకున్నది. ఐసీఎంఆర్‌ నిబంధనల్లో ఎక్కడ కూడా భౌతికకాయానికి పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదు. రాష్ట్రంలో నిత్యం వెయ్యిమంది మరణిస్తున్నారు. దేశంలో నిత్యం 30వేల మంది చనిపోతున్నారు. వారందరికీ టెస్టులు చేయడం సాధ్యం కాదు’’ అని ఈటల స్పష్టం చేశారు.