ఇవి లోపిస్తే షుగర్, గుండెపోటు రెట్టింపు!

ఇవి లోపిస్తే షుగర్, గుండెపోటు రెట్టింపు!

ఇవి లోపిస్తే షుగర్, గుండెపోటు రెట్టింపు!వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : నేటికాలంలో జీవనశైలి,మారుతున్నఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చాలా మంది మధుమేహం, గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ జీవనశైలి కారణంగా చాలామంది ప్రజలు బ్లడ్ షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితిలో రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు మీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మధుమేహం వ్యాధి కాదు. కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలమీదకే వస్తుంది. అధిక చక్కెరను కంట్రోల్ చేయనట్లైతే అది మీ శరీరంలోని వివిధ బాగాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అయితే మీ శరీరంలో ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉంటే మధుమేహం వచ్చే చాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా.

*మెగ్నీషియం చక్కెరస్థాయిని కంట్రోల్ చేస్తుంది.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలతోపాటు మెగ్నీషియం కూడా చాలా అవసరం. కాబట్టి మెగ్నిషియం లోపం ఉండకుండా చూసుకోవాలి. మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. మన శరీరంలో అనేక రసాయన ప్రతిచర్యలతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు శరీరం ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపించినట్లైతే మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. ఇదే కాకుండా గుండెజబ్బులు, బలహీనత,అలసట, కండరాల నొప్పులు, బలహీనమైన శరీరం వంటి సమస్యలు వస్తాయి.

ఈ పదార్థాలను తీసుకుంటే మెగ్నీషియం శరీరానికి అందుతుంది.
-డార్క్ చాక్లెట్
-అరటి పండ్లు,
-త్రుణధాన్యాలు
-ఆకు కూరలు
– సోయాబీన్
– అవకాడో
– పెరుగు
-అంజీర్
-చిక్కుళ్లు.