శుభమన్ గిల్ సూపర్ సెంచరీ 

శుభమన్ గిల్ సూపర్ సెంచరీ

శుభమన్ గిల్ సూపర్ సెంచరీ 

వరంగల్ టైమ్స్,స్పోర్ట్స్ డెస్క్ : భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 మ్యాచ్ లో శుభమన్ గిల్ చెలరేగి ఆడాడు. సిక్సర్లు, ఫోర్లతో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రతీ ఓవర్ లోనూ ఒక సిక్స్. దీంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 234 టీ 20లో ఇది అతి పెద్ద స్కోరు. భారత్ ఉంచిన లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించడం అంత సులువు కాదు. ఇషాన్ కిషన్ ఎప్పటిలాగానే ఔవుటయ్యాడు. రాహుల్ త్రిపాఠి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. హార్ధిక్ పాండ్యా 17 బాల్స్ లో 30 పరుగులు చేశాడు. కానీ శుభమన్ గిల్ మాత్రం 54 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శుభమన్ గిల్ మొత్తం 63 బాల్స్ లో 126 పరుగులు చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ ను గిల్ మరిపించాడు. హార్థిక్ పాండ్యా, శుభమన్ గిల్ జోడీ పరుగుల వరదను పారించింది. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సిక్సర్లు, ఫోర్లతో శుభమన్ గిల్ వన్డే తరహాలో టీ 20లోనూ తన సత్తా తగ్గలేదని నిరూపించాడు. చివరి వరకు నాటౌట్ గా నిలిచారు. దీంతో న్యూజిలాండ్ ఈ స్కోరును ఛేదించాలంటే శ్రమించాల్సి ఉంటుంది. భారత్ బౌలర్లు ఏ మాత్రం అలక్ష్యం వహించినా న్యూజిలాండ్ కు పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు సిరీస్ ను గెలిపించాల్సిన బాధ్యత బౌలర్లపైనే ఉంది. మరి భారత్ బౌలర్లు ఎలా రాణిస్తారన్నది చూడాల్సి ఉంది.