యాక్సిడెంట్ లో సబ్ ఎడిటర్ మృతి

యాక్సిడెంట్ లో సబ్ ఎడిటర్ మృతిహైదరాబాద్ : బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేగంపేట్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మధుసూధన్ అనే జర్నలిస్ట్ మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మధుసూధన్ ఆంధ్రజ్యోతి పత్రికలో ఇంటర్నెట్ డెస్క్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నాడు. అయితే రోడ్డు ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. బైక్ పై వెళ్తుండగా ఫ్రంట్ బ్రేక్ సడన్ గా వేయడం వల్ల బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగిందా, లేదా ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనేది తెలియాల్సి ఉంది.