ఫ్యామిలీ సూసైడ్ ..వైరల్ అవుతున్నసెల్ఫీ వీడియో

ఫ్యామిలీ సూసైడ్ ..వైరల్ అవుతున్నసెల్ఫీ వీడియోనిజామాబాద్ జిల్లా : విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడిన నిజామాబాద్ కు చెందిన సురేష్ ఫ్యామిలీ సూసైడ్ లో ఒక ట్విస్ట్ బయటపడింది. ఇద్దరు కొడుకులతో పాటు భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం తెలంగాణలో సంచలనంగా మారింది.

కొత్తగూడెం పాల్వంచలో రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకే మరో కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడం అందరిని కలిచివేసింది. అయితే సురేష్ కుటుంబం ఆత్మహత్యకు ముందు సురేష్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.

అధిక వడ్డీ వేధింపుల వల్లనే తాము మరణిస్తున్నట్లు వెల్లడించారు. అధిక వడ్డీల కోసం జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. అయితే జ్ఞానేశ్వర్ కు రూ.40 లక్షల దాకా వడ్డీలు చెల్లించామని , ఐనా ఇల్లు జప్తు చేస్తామని బెదిరించాడని ఆయన సెల్ఫీ వీడియోలో తమ బాధను వెల్లబుచ్చారు.

ప్రామిసరీ నోట్లపై భార్య, పిల్లల సంతకాలు కూడా తీసుకున్నారని, పైగా తమపై దుర్భాషలాడాడని తెలిపారు. ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. అధిక వడ్డీల కోసం గణేష్ అనే వ్యక్తి కూడా తీవ్ర వేధింపులకు గురిచేశాడని చెప్పారు. ఇప్పటికే గణేష్ కు రూ. 80 లక్షల దాకా చెల్లించానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జ్ఞానేశ్వర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.