మొండెం లేని తల..భయాందోళనలో ప్రజలు

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలంలో దారుణం జరిగింది. చింతపల్లి మండలంలోని విరాట్ నగర్ లో ఉన్న మెట్టు మహంకాళి ఆలయం వద్ద దుండగులు మొండెం లేని తలను వదిలివెళ్లారు. నేడు తెల్లవారుజామున తలను గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఐతే ఆదివారం రాత్రి ఆలయం వద్ద నరబలి జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.