కరీంనగర్ జిల్లా : హైకోర్టు మొట్టికాయలు వేసినా , కేసీఆర్ కు సిగ్గు లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి సొంత పూచీకత్తుతో విడుదలైన బండి సంజయ్ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని జైలు నుంచి విడుదలైన అనంతరం బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న లోపాలను ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారా అని ఆయన ధ్వజమెత్తారు.. నన్ను జైలుకు పంపడం కాదు, నిన్ను జైలుకు పంపడం ఖాయమని కేసీఆర్ ను బండి సంజయ్ హెచ్చరించారు. ఉద్యోగుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టించడం సిగ్గుచేటని ఆగ్రహించారు.
రాష్ట్రంలో అవినీతి పాలన చేస్తున్నకేసీఆర్ రానున్న రోజుల్లో జైలుకు పోతే బయటికి రావడమే కష్టమని ఎద్దేవా చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో గుర్తుకు రాని కొవిడ్ నిబంధనలు మేం ప్రజాసమస్యలకోసం దీక్షలు పెడితే గుర్తుకు వచ్చాయా అంటా బండి సంజయ్ కేసీఆర్ తీరును వక్రీకరించారు.