మంత్రి గంగులకు పితృవియోగం

మంత్రి గంగులకు పితృవియోగం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ( 87) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తండ్రి మరణవార్త తెలియగానే మంత్రి గంగుల కమలాకర్ తన ఇంటికి చేరుకున్నారు. తండ్రి భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు.మంత్రి గంగులకు పితృవియోగం

సీఎం కేసీఆర్ తో పాటు పలువురి సంతాపం..
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సీఎం తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చీఫ్ విప్ , ఎంపీలు కూడా సంతాపం ప్రకటించారు.