నిమ్స్ లో 132 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 

నిమ్స్ లో 132 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషనల్ డెస్క్ : రాష్ట్రంలో వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. హైదరాబాద్ నిమ్స్ లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నింటిని డైరెక్ట్ రిక్రూటమ్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. క్యాడర్ వైస్ వెకేన్సీ పొజిషన్, రోస్టర్ పాయింట్లు, అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.