పాము కాటుకు గురైన సల్లూ భాయ్.. ప్రస్తుతం సేఫ్

పాము కాటుకు గురైన సల్లూ భాయ్.. ప్రస్తుతం సేఫ్ముంబయి : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. పన్వేల్ లోని ఫాంహౌస్ లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం వీకెండ్ విడిది కోసం శనివారం ఫాంహౌస్ కి వెళ్లాడు. అర్ధరాత్రి దాటాక అతని కాలుపై పాము కాటేసింది. దీంతో అతని వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

ఐతే సల్మాన్ ఖాన్ ని విషం లేని పాము కాటేసిందని, దాని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం ఆదివారం ఉదయం సల్లూభాయ్ తిరిగి తన ఫాం హౌస్ కి వచ్చినట్లు సమాచారం. ప్రతస్తుం సల్లూ భాయ్ ఆరోగ్యం బాగానే ఉందని, కొన్ని రోజుల పాటు ఫాంహౌస్ లోనే విశ్రాంతి తీసుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు.