భారత్ లో కొత్తగా 7350 కరోనా కేసులు

భారత్ లో కొత్తగా 7350 కరోనా కేసులున్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 7350 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860కి చేరింది. ఇందులో 4,75,636 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. 3,41,30,768 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 91,456 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

డిసెంబర్ 12 ఆదివారం నుంచి డిసెంబర్ 13 సోమవరం వరకు 202 మంది మృతి చెందగా, 7973 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇక కరోనా యాక్టివ్ కేసులు 561 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అదే విధంగా యాక్టివ్ కేసులు 0.26 శాతం, రికవరీ రేటు 98.37 శాతం ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,33,17,84,462 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది.