భారత్ కు దక్కిన మిస్ యూనివర్స్ కిరీటం

భారత్ కు దక్కిన మిస్ యూనివర్స్ కిరీటంన్యూఢిల్లీ : మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్ లో జరుగుతున్న 70వ మిస్ యూనివర్స్ -2021 పోటీల్లో పంజాబ్ కు చెందిన 21 ఏండ్ల హర్నాజ్ కౌర్ సంధు టైటిల్ ను గెలుచుకుంది. దీంలో 21 ఏండ్ల తర్వాత భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కినట్లైంది.

ఇజ్రాయెల్ లోని ఐలాట్ లో జరిగిన ఈ పోటీలో పరాగ్వే, దక్షిణాఫ్రికాకు చెందిన యువతులతో హర్నాజ్ సంధు పోటీపడింది. వారిపై నెగ్గిన హర్నాజ్ కు మెక్సికోకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని ధరింపచేసింది.

మొదటిసారి 1994లో సుస్మితా సేన్ విశ్వసుందరి కిరీటాన్ని ధరించింది. తర్వాత 2000 సంవత్సరంలో లారాదత్తా ఈ టైటిల్ ను సొంతం చేసుకుంది. మళ్లీ సరిగ్గా 21 యేండ్ల తర్వాత అందులోనూ 2021లో 21 ఏండ్ల హర్నాజ్ సంధుకు ఈ కిరీటం దక్కడం విశేషం.