బీజేపీ సీనియర్ నాయకుడు హర్బాన్స్ కన్నుమూత

బీజేపీ సీనియర్ నాయకుడు హర్బాన్స్ కన్నుమూతడెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హర్బాన్స్ కపూర్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో మరణించారు. ఆదివారం రాత్రి డెహ్రాడూన్ లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. హర్బాన్స్ కపూర్ మృతికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

హర్బాన్స్ కపూర్ కు సంబంధించిన గత జ్ఞాపకాలను ఆయన నెమరువేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలంగా హర్బాన్స్ కపూర్ మృ తికి రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

హర్బాన్స్ కపూర్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు కలిపి మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా కూడా ఆయన పనిచేశారు. హర్బాన్స్ కపూర్ మృతిపట్ల పలువురు బీజేపీ నాయకులు సంతాపం ప్రకటించారు.