కేసీఆర్ కు ఐలోని మల్లన్న ఉత్సవాల ఆహ్వానం 

కేసీఆర్ కు ఐలోని మల్లన్న ఉత్సవాల ఆహ్వానం

కేసీఆర్ కు ఐలోని మల్లన్న ఉత్సవాల ఆహ్వానం 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరుకావాల్సిందిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోరారు. ఈ నెల 13నుండి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సోమవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆహ్వాన పత్రికను అందచేసి, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఐనవోలు ఆలయ వేదపండితులు సీఎం కేసీఆర్ కు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆలయ ఈఓ నాగేశ్వర రావు, ఆలయ మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య, ప్రధాన అర్చకులు రవీందర్, విక్రంత్ జోషి, మధుకర్ శర్మ, పురుషోత్తమ శర్మ తదితరులున్నారు.