ఆ నలుగురిపై కొరఢా ఝులిపించిన సీపీ రంగనాథ్

ఆ నలుగురిపై కొరఢా ఝులిపించిన సీపీ రంగనాథ్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ తో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను, ఒక కానిస్టేబుల్ ను సీపీ ఏవి రంగనాథ్ సస్పెండ్ చేశారు. టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ వి.నరేష్ కుమార్ తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు పి.శ్యాంసుందర్, కె.సోమలింగం మరియు కానిస్టేబుల్ బి. సృజన్ ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి నిందితులపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు వారు ఇతరత్రా అక్రమ వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు నిజ నిర్ధారణ చేసిన అనంతరం సీపీ రంగనాథ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. దీంతో ఆరోపణలు నిర్ధారణ అయిన వెంటనే సీపీ రంగనాథ్ వారిని సస్పెండ్ చేస్తూ, నేడు ఉత్తర్వులు జారీ చేశారు.