వర్మ ట్వీట్ పై టీడీపీ ఫైర్ 

వర్మ ట్వీట్ పై టీడీపీ ఫైర్

వర్మ ట్వీట్ పై టీడీపీ ఫైర్ వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని తాను ఊహించలేదని ‘RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై కాపు సంఘాల నాయకులతో పాటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించాయి. రాంగోపాల్ వర్మ ట్వీట్ వెనుక వైఎస్సార్ సీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో జనసేనకు మద్దతుగా వర్మపై టీడీపీ విమర్శలకు దిగింది.

వర్మపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాంగోపాల్ వర్మ ఒక కామ మృగం, దరిద్రుడని తీవ్రస్థాయిలో దూషించారు. కులాల గురించి దర్శకుడు మాట్లాడటం ఏంటని ఆయన నిలదీశాడు. కమ్మ, కాపు కలిస్తే ఆర్జీవీకి వచ్చిన ఇబ్బంది ఏంటని బండారు ప్రశ్నించడం గమనార్హం. ఆర్జీవీని ఆయన భార్య, కూతురు కూడా అసహ్యించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.