బీజేపీ ఫ్యాషన్ షోలను పట్టించుకోవద్దు : చల్లా

బీజేపీ ఫ్యాషన్ షోలను పట్టించుకోవద్దు : చల్లా

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : బీజేపీ నాయకుల నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఫ్యాషన్ షోలు వస్తూ పోతుంటాయి.. అలాంటి వారిని పట్టించుకోవద్దని బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు సూచించారు. గ్రామాలలో, వాడలలో తిరుగుతూ తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని తెలిపారు. సోమవారం శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఆయన నివాసంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.బీజేపీ ఫ్యాషన్ షోలను పట్టించుకోవద్దు : చల్లాఈ సమావేశంలో ఆత్మకూరు మండలం కటాక్షపూర్, హౌజ్ బుజుర్గ్, నీరుకుళ్ళ, పెంచికలపేట గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలను ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండి సాంబయ్య బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అతనికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చర్చించుకున్నారు.

దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రాణాలకు తెగించి ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, సుపరిపాలన చేస్తున్నాడని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కేసీఆర్ నడుంబిగించారని కొనియాడారు. బీఆర్ఎస్ పై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రతీ కార్యకర్త తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే చల్లా సూచించారు. ఈ సమావేశంలో మండల ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, యువ నాయకులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.