పీజీ వైద్య సీట్ల భర్తీకి మరో ప్రకటన

పీజీ వైద్య సీట్ల భర్తీకి మరో ప్రకటన

*ఈ నెల 12 వరకు వెబ్ ఆప్షన్లు
*ఖాళీ సీట్ల భర్తీకి మరో అవకాశం
*తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన ఎంసీసీ

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : పీజీ వైద్య విద్య కన్వీనర్ కోటా సీట్లకు మరో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ ‌తెలిపింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మరో అవకాశం కల్పిస్తూ తాజాగా ఎంసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ నేడు స్పెషల్ స్ట్రే (STRAY)విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

ఇప్పటికే నాలుగు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను ఈ చివరి విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. నేడు సాయింత్రం 5 గంటల నుండి ఈ నెల 12 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హత, ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.