మరోసారి ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఛాన్స్

మరోసారి ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఛాన్స్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టుని ఓటు నమోదు చేసుకున్న ప్రతీ ఒక్కరూ సరిచూసుకోవలసిందిగా ప్రముఖ విద్యావేత్త టీఆర్ ఎస్ సీనియర్ నాయకులు పీ.ఎల్ శ్రీనివాస్ సూచించారు.మరోసారి ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఛాన్స్ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య 4,48,961. ఓటు నమోదుకు జనవరి 8 వరకు అవకాశం ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ఓటు నమోదు చేసుకోవలసిందిగా పీ.ఎల్ శ్రీనివాస్ కోరారు. ఈ సారి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రజలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని, ఓటర్ల నమోదు బాగా జరిగితే ఇంకా బాగుంటుందని వారు విజ్ఞప్తి చేసారు.

ఈ క్రింది ఆన్ లైన్ లింక్ ద్వారా లాగిన్ అయ్యి ప్రతీ ఒక్కరూ వారి ఓటును తనిఖీ చేసుకోవచ్చునని పీ ఎల్ శ్రీనివాస్ తెలిపారు.

https://ceotserms1.telangana.gov.in/MLC_CLAIMS/Eroll_Forms/mlc_status.aspx

ఇంకా ఓటు నమోదు చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈ క్రింది ఆన్లైన్ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని పీ ఎల్ శ్రీనివాస్ తెలిపారు .

ఓటు నమోదు చేసుకోవడానికి లింక్:
https://ceotserms1.telangana.gov.in/MLC/Form18.aspx