స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మృతి

స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మృతి

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం చెందాడు. 52 ఏళ్ల వార్న్ గుండెపోటుతో థాయిలాండ్ లో మృతి చెందాడు. థాయిలాండ్ లో ఉన్న షేన్ వార్న్ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతన్ని బతికించడానికి మెడికల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. షేన్ వార్న్ గతంలో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ఆస్ట్రేలియాతో పాటు ఐసిసి, వివిధ దేశాల క్రికెట్ క్రీడాకారులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపారు.స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మృతిఈ సందర్భంగా షేన్ వార్న్ ఆస్ట్రేలియా క్రికెట్ కోసం చేసిన సేవలను, ఆయన రికార్డులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకడిగా వార్న్ పేరు గాంచాడు. ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్లనే ​​తన బౌలింగుతో ముప్పుతిప్పలు పెట్టాడు. 2013లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు షేన్ వార్న్ వీడ్కోలు పలికారు. 1992 నుంచి 2007 వరకు ఆసీస్ తరపున షేన్ వార్న్ ప్రాతినిధ్యం వహించారు.

1994లో విజ్టెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా షేన్ వార్న్ ఎంపికయ్యారు. 2008లో రాజస్థాన్ రాయల్స్ కు సారథిగా వ్యవహరించారు. టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, టెస్టుల్లో 10 సార్లు 10 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. 145 టెస్టుల్లో అత్యధిక వికెట్లు 708 తీసిన రెండో బౌలర్, టెస్టులు, వన్డేల్లో కలిపి 1001 వికెట్లు తీసిన రికార్డులు షేన్ వార్న్ సొంతం. షేన్ వార్న్ 2021 లో కరోనా బారిన పడి తర్వాత కోలుకున్నారు.