ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు మండలం ఎర్రగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జై, మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతిమృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, ఆటో డ్రైవర్ ఉన్నారు. మృతులు మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన అజయ్ ( 12), కిరణ్ (16), కౌసల్య ( 60), డ్రైవర్ జానీ (23)గా గుర్తించారు. పల్లెబోయిన పద్మ, రసూల్, వెన్నెల, వసంత తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.