మణిపూర్ లో నేడు రెండో దశ పోలింగ్

మణిపూర్ లో నేడు రెండో దశ పోలింగ్

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : మణిపూర్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. 6 జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. 92 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రెండో దశలో పోలింగ్ లో 8,47,400 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 4,18,401 మంది పురుషులు, 4,28,968 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వీరికోసం 1247 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.మణిపూర్ లో నేడు రెండో దశ పోలింగ్మాజీ సీఎం ఓక్రం ఇబోబిసింగ్, ఆయన కుమారుడు సూరజ్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం గైఖాంగమ్ వంటి ప్రముఖులతో పాటు బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ 18, జేడీయూ, నాగా పీపుల్స్ ఫ్రంట్ చెరో 10 మంది, నేషనల్ పీపుల్స్ పార్టీ 11 మంది, శివసేన, ఎన్ సీపీ ఇద్దరు చొప్పున, ఆర్పీఐఏ నుంచి ముగ్గురు, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు రెండో విడత బరిలో నిలిచారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఫిబ్రవరి 28న 38 స్థానాలకు మొదటి విడుత ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే.