శ్రీవారి సన్నిధిలో వద్దిరాజు రవిచంద్ర

శ్రీవారి సన్నిధిలో వద్దిరాజు రవిచంద్రతిరుపతి : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కుటుంబసభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తెల్లవారుజామున తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని స్వామి వారి సేవలో తరించారు.

వద్దిరాజు రవిచంద్రతో పాటు ఆయన సతీమణి విజయలక్ష్మి, కూతురు గంగాభవాని, అల్లుడు సందీప్ స్వామిలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా, ఒమిక్రాన్ వంటి మహమ్మారి బారిన పడకుండా ప్రజలను కాపాడాలని శ్రీవారి సన్నిధిలో పూజలు చేసినట్లు గాయత్రి రవి తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో శ్రీవారి సన్నిధిలో గడిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండేలా దీవించాలని కలియుగ దైవాన్ని వేడుకున్నట్లు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.