క్వారంటైన్ లో తండ్రీకొడుకులు

క్వారంటైన్ లో తండ్రీకొడుకులుహైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, ఐసోలేషన్ లో ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను క్వారెంటైన్ లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే సోమవారం నాడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.