ఆ రాష్ట్రాల మరో సారి దక్కని అనుమతి

ఆ రాష్ట్రాల మరో సారి దక్కని అనుమతిహైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతీ యేడాది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను ఢిల్లీలో ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కేవలం 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలకు మాత్రమే అనుమతి లభించింది. తెలంగాణ, ఏపీకి నిరాశే మిగిలింది. హర్యానా, గోవా, చత్తీస్ గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గుజరాత్ , మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ శకటాలకు అనుమతి లభించింది. విద్యా నైపుణ్యాభివృద్ధి, విమానయాన శాఖ, సమాచార, తపాలా, హోంశాఖ, జలశక్తి, సాంస్కృతిక శాఖల శకటాలకు అనుమతి లభించింది.