గజ గజ వణికిస్తున్న చలి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత రెండ్రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య భారత్ నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతో జనం వణుకుతున్నారు. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 వరకు 24 గంటల వ్యవధిలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లీలో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ లో 6.6, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరలో 7, బేలా మండల కేంద్రం, బోథ్ మండలం సోనాలలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు, మూడ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ కేంద్రం అధికారుల అంచనా. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావంతో శని, ఆదివారాల్లో తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్దరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.