మృతుల కుటుంబాలకు చెక్కులు అందించిన చల్లా

మృతుల కుటుంబాలకు చెక్కులు అందించిన చల్లాహనుమకొండ జిల్లా : పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆ దిశగానే పార్టీ కోసం పనిచేసి చనిపోయిన బాధిత కుటుంబాలకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను ఇస్తుందన్నారు.

హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పరకాల నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆరుగురు బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతీ కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీ భీమా వర్తింపచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

మృతుల కుటుంబాలకు చెక్కులు అందించిన చల్లాపరకాల మండలం లక్ష్మీపురంకు చెందిన గురిజపల్లి సత్యం, సీతారాంపురంకు చెందిన వెల్దండి స్రవంతి, నడికూడ మండలం సర్వాపూర్ కు చెందిన మీణుగు రాజు, రామకృష్ణాపూర్ కు చెందిన యార రాజమల్లు, సంగెం మండలం కాట్రపల్లికి చెందిన వల్లెపు సంపత్, దామెర మండలం తక్కళ్ళపాడ్ కు చెందిన పల్లకొండ సారంగం కుటుంబాలకు చల్లా ధర్మారెడ్డి ఈ చెక్కులను అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, మాజీ కూడా డైరెక్టర్ ఎన్కతాళ్ల రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ, జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు పులుగు సాగర్ రెడ్డి, నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, దామెర మండల అధ్యక్షుడు గుండు రాము, ఎంపీపీ కాగితాల శంకర్, జెడ్పీటీసీ గరిగే కల్పన కృష్ణమూర్తి, టీఆర్ఎస్ నాయకులు వున్నం సంపత్, దాడి మల్లయ్య, దాడి రమేష్, ముష్కే రాము, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.