అన్ని వర్గాల అభివృద్దే కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే చల్లా

అన్ని వర్గాల అభివృద్దే కేసీఆర్ లక్ష్యం : ఎమ్మెల్యే చల్లాహనుమకొండ జిల్లా : అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో పరకాల నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సుమారు 8 మంది లబ్ధిదారులకు రూ.4 లక్షల 34 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.

పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం పల్లారుగూడకు చెందిన విజయ్ కుమార్ (రూ.41వేలు), సింగారపు సరోజన (రూ.60వేలు), గవిచర్ల గ్రామానికి చెందిన పెండ్లి వీరమ్మ ( రూ.60వేలు), పరకాల మండలం పోచారంకు చెందిన ఇనుముల జంపయ్య (రూ.60వేలు), నడికూడ మండలం నర్సక్కపల్లికి చెందిన జుంకాజువ్వ ఐలయ్య ( 60వేలు), దామెర మండలం లాదెల్ల కు చెందిన కసువొజ్జుల శ్రీనివాస్ ( రూ.40వేలు), పసరగొండ గ్రామానికి చెందిన లబ్ధిదారునికి (రూ.53వేలు), పరకాలకు చెందిన గువ్వా సాంబయ్య (రూ. 60వేలు) లు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్నారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకునే మహనీయుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అన్నారు. ఆ దిశగానే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి, ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు. నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతోనే కేసీఆర్ సీఎం సహాయ నిధి పథకం ద్వారా సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చల్లా కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు,జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.