వరంగల్ లో వర్ష బీభత్సం..పంట పొలాలు వర్షార్పణం

వరంగల్ లో వర్ష బీభత్సం..పంట పొలాలు వర్షార్పణంవరంగల్ జిల్లా : తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండ్రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలివాన భీభత్సంతో , వడగళ్ల వాన కురిసింది . నిన్న రాజధాని హైదరాబాద్ తోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.

వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో గత రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న ఇండ్లను, చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నల్లబెల్లి మండలం కొండైలు పల్లి గ్రామంలో గాలి వాన బీభత్సానికి మొక్కజొన్న, మిర్చీ పంటలు నీటిపాలయ్యాయి. చెట్లు విరిగి పడ్డాయి.

ఇండ్లు కూలాయి. రైతుకు తీవ్ర నష్టం కలగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు.