హీరో మహేశ్‌బాబు సోదరుడు కన్నుమూత

హీరో మహేశ్‌బాబు సోదరుడు కన్నుమూత

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హీరో మహేశ్‌బాబు సోదరుడు కన్నుమూత