తురుమ్ ఖాన్‌లు టీజర్ విడుదల

తురుమ్ ఖాన్‌లు టీజర్ విడుదల

హైదరాబాద్ : మాధవరావు సమర్పణలో కెకె.సినిమాస్ పతాకంపై కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం తురుమ్ ఖాన్‌లు, రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన మరియు థియేటర్ ఆర్టిస్టులు నటించారు. శివకళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం టీజర్ ని ప్రముఖ దర్శకుడు పరశురామ్ బుజ్జి విడుదల చేశాడు. పూర్తి ఆర్గానిక్, మాస్ కామెడీగా కేవలం 21రోజుల్లో వందశాతం గింబల్ తో షూట్ చేసి, కొత్త విధానంలో తెరకెక్కిన ఈ తురుమ్ ఖాన్‌లు “లోకల్ ఇతివృత్తాలు గ్లోబల్ లో ఆవిష్కరించాలి.

ఈ యంగ్ టీమ్ చేసిన ప్రయత్నం అలాగే ఉంది ఈ చిత్రం మేకింగ్ చేసిన విధానం వింటే చాలావిచిత్రంగా అనిపించింది .. స్టాండర్డ్ మేకింగ్. నైపుణ్యం కలిగిన నటులు వీటివల్ల ఈ చిత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, కామిక్ గా చూడాలనే ఆతృత కలిగించేలా ఉంది. టీమ్ అందరికీ శుభాకంక్షలు అన్నారు దర్శకుడు పరశురామ్.

ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ చిత్ర ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా తురుమ్ ఖాన్‌లు ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తాము అన్నారు దర్శకుడు శివ కళ్యాణ్.

నటీనటులు:
శ్రీరామ్ నిమ్మల. దేవరాజ్ పాలమూరు, అవినాష్, ఐశ్యర్య

సాంకేతిక నిపుణులు:
ఎడిటర్: నగేష్ రెడ్డి బొంతల
కెమెరామెన్: చరణ్ అంబటి
సంగీతం: సురేష్ బొబ్బిలి
డిజైన్: దని ఏలే
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: రియాన్ ముస్తఫా
నిర్మాత: కె. కళ్యాణ్ రావు
రచనా, దర్శకత్వం: శివకళ్యాణ్