దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతున్న‌ది

న్యూఢిల్లీ: దేశంలో గ‌త మూడు రోజులుగా ప్ర‌తిరోజూ అర ల‌క్ష‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా 54 వేలకుపైగా మందికి క‌రోనా సోకింది. భారీగా పాజిటివ్‌ కేసులు వస్తుండ‌టంతో నాలుగు రోజుల్లోనే రెండు ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 17 ల‌క్ష‌లు దాటాయి. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 54,736 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 17,50,724కి చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 5,67,730 యాక్టివ్ కేసులు ఉండ‌గా, మ‌రో 11,45,630 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల కొత్త‌గా 853 మంది మ‌ర‌ణించారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఒకేరోజులో ఇంత పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో క‌రోనా మృతులు 37,364కు పెరిగార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.