అమిత్ షాకు క‌రోనా పాజిటివ్

అమిత్ షాకు క‌రోనా పాజిటివ్ న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు అమిత్ షానే అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకున్నాను. కొవిడ్ ఫ‌లితాల్లో త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని పేర్కొన్నారు. త‌న ఆరోగ్యం బాగానే ఉంది. కానీ డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లు అమిత్ షా తెలిపారు. ఇటీవ‌లి కాలంలో త‌న‌ను సంప్ర‌దించిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అమిత్ షా విజ్ఞ‌ప్తి చేశారు.