మహాశివరాత్రికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలు

మహాశివరాత్రికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలువరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ సిద్ధం అవుతుంది. భక్తుల సౌకర్యం కోసం మహాశివరాత్రి పర్వదినాన టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు రేపటి నుంచి మార్చి 4 వరకు ఉంటాయని టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మహా శివరాత్రి రోజు అత్యంత రద్దీ ఉండే కీసర గుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అల్వాలా, అమ్మూగూడా, బాలానగర్ క్రాస్ రోడ్డు, మియాపూర్ క్రాస్ రోడ్డు, పటాన్ చెరువుతో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించారు. అలాగే 30 మంది ప్రయాణికులు ఒకే చోట ఉంటే, అక్కడికి ఆర్టీసీ బస్సును ప్రత్యేకంగా పంపిస్తామని తెలిపారు. టీఎస్ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక బస్సుల సేవలను ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.