త్వరలో బీఆర్ఏఓయూ డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్

త్వరలో బీఆర్ఏఓయూ డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ ఫస్ట్ , థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ పరీక్షలు ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండో సంవత్సరం 3వ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి 23వ వరకు, మూడో సంవత్సరం 5వ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 30 వరకు, అలాగే మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 20 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చివరి తేదీ. పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు www.braouonline.in పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అనంతరం ఫీజును T.S/A.P ఆన్లైన్ సెంటర్ల ద్వారా లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలని సూచించారు.