హైదరాబాద్ లో ప్రారంభమైన శోభాయాత్ర 

హైదరాబాద్ లో ప్రారంభమైన శోభాయాత్ర

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వరకు 12 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. శోభాయాత్ర ప్రారంభం కంటే ముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గౌలిగూడ రామ్ మందిర్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇక కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభమైంది.హైదరాబాద్ లో ప్రారంభమైన శోభాయాత్ర ఈ రెండు శోభాయాత్రలు కోఠిలో కలుసుకోనున్నాయి. గౌలిగూడ, కోఠి, సుల్తాన్ బజార్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ , అశోక్ నగర్ ఎక్స్ రోడ్, గాంధీ నగర్, కవాడిగూడ, ఆర్పీ రోడ్ , ప్యారడైజ్ మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది. హనుమాన్ శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శోభాయాత్రకు సంబంధించిన భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. మొత్తం 8 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.