మానుకోటలో కీచక టీచర్ వేధింపులు
వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా : అభం శుభం తెలియని పసిబాలిక పై ఓ ప్రధానోపాధ్యాయుడు అత్యాచారయత్నం చేశాడు. కీచక టీచర్ వేధింపులు తాళలేక స్కూల్ కి వెళ్లకుండా ఉన్నప్పటికీ ఆ చిన్నారిని కామాంధుడు వదిలిపెట్టలేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్ధిని ఇంటిలో తల్లితండ్రులు లేని సమయంలో వచ్చి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ప్రధానోపాధ్యాయుడు. తమ్ముడు చెల్లెలు కేకలు వేయడంతో అక్కడి నుంచి కీచక టీచర్ రాజయ్య పరార్ అయ్యాడు. ఇంటికి రాగానే విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు 1098 కు సమాచారం అందించారు. బాధిత తల్లిదండ్రుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు, జిల్లా విద్యాశాఖ , బాలల సంరక్షణ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.