వరంగల్ లో ప్రేమోన్మాది ఘాతుకం 

వరంగల్ లో ప్రేమోన్మాది ఘాతుకం

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. గొంతుకోసి తీవ్రంగా గాయపర్చడంతో చికిత్స కోసం స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్ళితే వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామానికి చెందిన అనూష కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది.వరంగల్ లో ప్రేమోన్మాది ఘాతుకం కొంతకాలంగా అనూషను ప్రేమ పేరుతో అజహర్ అనే యువకుడు వేధిస్తున్నాడు. అనూష అజహర్ ప్రేమను నిరాకరిస్తుంది. దీంతో రెచ్చిపోయిన అజహర్ అనూషపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయం కావడంతో స్థానికులు వెంటనే అనూషను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. పరారీలో ఉన్న అజహర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.