కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ
వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో భేటీ జరుగుతున్నది. మంత్రులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేబినెట్ లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. ధాన్యం సేకరణపై కేంద్రానికి సీఎం కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగుస్తుండటంతో ఈ అంశంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈసందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.