మోడీ నియోజకవర్గంలోనే బీజేపీకి షాక్ 

మోడీ నియోజకవర్గంలోనే బీజేపీకి షాక్

వరంగల్ టైమ్స్, యూపీ : యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఝలక్ తగిలింది. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీకి స్వతంత్ర అభ్యర్థి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికంగా మంచి పట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ బీజేపీ అభ్యర్థి సుధామ పటేల్ ను ఓడించారు. వారణాసి-చందౌలి, బధౌలీ ఎమ్మెల్సీ సీటు నుంచి అన్నపూర్ణ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి, విజయం సాధించింది. ఇక ప్రతాప్ గఢ్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. రాజా భయ్యా సన్నిహితుడు అక్షయ్ ప్రతాప్ సింగ్ బీజేపీ అభ్యర్థి హరి ప్రతాప్ సింగ్ ను ఓడించారు.మోడీ నియోజకవర్గంలోనే బీజేపీకి షాక్ ఇక అజంగఢ్ లోనూ బీజేపీ ఓడిపోయింది. బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్సీ యశ్వంత్ తన కుమారుడు విక్రాంత్ సింగ్ ను ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి దింపారు. బీజేపీ తన అభ్యర్థిగా రమాకాంత్ యాదవ్ ను దింపింది. పార్టీపై యశ్వంత్ తిరుగుబాటు చేసినా, తన కుమారుడు విక్రాంత్ సింగ్ ను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. ఇక మొత్తం 36 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగగా, బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుంది.