డీసీఎం బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు
వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వలస కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ జిల్లాలోని రేగొండ మండలం జంషెడ్ పేట్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి కెనాల్ కాలువలో బోల్తా పడటంతో 15 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ములుగు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రమాద బాధితులకు ములుగు జిల్లా వైద్యాధికారి దగ్గరుండి వైద్యం అందించారు.