సన్ రైజర్స్ ఎఫెక్ట్.. గుజరాత్ కు తొలి ఓటమి

సన్ రైజర్స్ ఎఫెక్ట్.. గుజరాత్ కు తొలి ఓటమి

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ 2022లో ఓటమి లేకుండా సాగుతున్న గుజరాత్ టైటన్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి రుచి చూపించింది. సమిష్టిగా రాణిస్తే ఎలాంటి జట్టునైనా ఓడించవచ్చని మరోసార నిరూపించింది. మొదట బౌలర్లు రాణించడంతో గుజరాత్ జట్టును 162/7 స్కోరుకు కట్టడి చేసిన సన్ రైజర్స్ , ఆ తర్వాత ఓపెనర్లు అభిషేక్ శర్మ (42), కేన్ విలియమ్సన్ ( 57) రాణించడంతో విజయం దిశగా సాగింది. రాహుల్ త్రిపాఠి ( 17) రిటైర్డ్ హార్ట్ గా మైదానం వీడటంతో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ( 34 నాటౌట్ ) కూడా రాణించడంతో సన్ రైజర్స్ గెలుపు లాంఛనమే అయ్యింది.సన్ రైజర్స్ ఎఫెక్ట్.. గుజరాత్ కు తొలి ఓటమిఅతనికి జత కలిసిన ఎయిడెన్ మార్క్రమ్ ( 12 నాటౌట్ ) మంచి సహకారం అందించడంతో చివరి ఓవర్లో సన్ రైజర్స్ విజయానికి కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరం పడింది. దర్షన్ నల్కండే వేసిన ఆ ఓవర్ మొదటి బంతికే సిక్సర్ బాదిన పూరన్ , సన్ రైజర్స్ కు విక్టరీని కట్టబెట్టాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.