భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశంలో ధరల మోత మోగుతున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోలియం కంపెనీలు మరోసారి భారం మోపాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ పై భారీగా వడ్డించాయి. నెలవారీ సమీక్షలో భాగంగా ఒకేసారి రూ.104 పెంచాయి. దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2563.5 కి పెరిగింది. గతంలో ఇది రూ. 2460 గా ఉన్నది. ఢిల్లీలో రూ.102.5 లు పెరగడంతో రూ.2355 కు చేరింది. ముంబైలో రూ.2329.50, కోల్ కతాలో రూ.2477.50, చెన్నైలో రూ. 2508 కి పెరిగింది. గత నెల 1న కమర్షియల్ సిలిండర్ పై రూ.268.5 వడ్డించాయి. తాజాగా మరో రూ.104 పెరగడంతో 2 నెలల్లోనే రూ. 372 ప్రజలపై భారం మోపాయి. ఐతే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర పెరగకపోవడం సంతోషించదగిన విషయమే.