మే డే వేడుకల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

మే డే వేడుకల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మే డే ను పురస్కరించుకుని హనుమకొండ జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నిర్వహించిన మే డే ఉత్సవాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ , ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పలు చోట్ల జెండా ఎగురవేశారు. కార్మికులకు మే డే శుభాకాంక్షాలు తెలిపారు.మే డే వేడుకల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్కార్మికుల సమస్యలను నిరంతరం దగ్గరుండి చూస్తూ, వారికి వెన్నంటే ఉంటూ వారి హక్కులను కాపాడే నాయకుడిగా నిలుస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ మే డే ను పురస్కరించుకుని ఈ నెలంతా కార్మిక చైతన్య మాసోత్సవాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మే 31న కార్మికులతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కార్మిక దినోత్సవాన్ని ఒక్క రోజే కాకుండా నెల మొత్తం వేడుకలు నిర్వహించుకోవాలని, కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చీఫ్ విప్ పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కార్మిక చైతన్య మాసోత్సవాలు ఒక చెంప పెట్టులా ఉంటాయని ఆయన అన్నారు.మే డే వేడుకల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ఇందులో భాగంగా మే డే న పశ్చిమ నియోజకవర్గంలోని మర్కాజీ స్కూల్ దగ్గర హమాలీ మరియు ప్లంబర్స్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. అకోక జంక్షన్ లో పెయింటర్స్ ఆధ్వర్యంలో, హనుమకొండ చౌరస్తాలో ఆల్ షాప్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకలలో పాల్గొన్నారు. మలేరియా విభాగం కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకలలో పాల్గొన్నారు. తర్వాత కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించారు. కాజీపేట బాపూజీ నగర్ చౌరస్తాలో ఎలక్ట్రీషియన్ మరియు ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అనంతరం దాస్యం రంగశీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధ పడుతున్న నిరుపేద ఆటోడ్రైవర్లకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.