రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు 

రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెల్పింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని తెల్పింది. అలాగే ఆది, సోమవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని ప్రకటించింది.