నటుడు చలపతిరావు మృతికి కేసీఆర్ సంతాపం

నటుడు చలపతిరావు మృతికి కేసీఆర్ సంతాపం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రముఖ నటుడు చలపతిరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. చలపతిరావు మరణం సినీ రంగానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వెండితెరపై నటుడు చలపతిరావు తనదైన ముద్ర వేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వందలాది సినిమాల్లో చలపతిరావు వైవిధ్యమైన పాత్రలు పోషించారని కేసీఆర్ గుర్తు చేశారు. చలపతిరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆయన కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని సూచించారు.నటుడు చలపతిరావు మృతికి కేసీఆర్ సంతాపం