ఆర్మీ జవాన్లను మింగేసిన బస్సు

ఆర్మీ జవాన్లను మింగేసిన బస్సు

వరంగల్ టైమ్స్, క్రైమ్ డెస్క్ : సిక్కింలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోయలో పడ్డ ఆర్మీ బస్సు పడి, 16 మంది జవాన్లు మృతి చెందారు. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16 మంది జవాన్లు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. లాచెన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెమా 3 వద్ద ప్రమాదం జరిగింది. పలువురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఆర్మీ జవాన్లను మింగేసిన బస్సు