యాదాద్రిలో భక్తుల కిటకిట

యాదాద్రిలో భక్తుల కిటకిట

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దేవాలయ ప్రాంగణం, మాడవీధులు, ప్రసాద విక్రయశాల, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ కిక్కిరిసాయి.యాదాద్రిలో భక్తుల కిటకిటధర్మ దర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెల్పారు. 44వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.64,50,178 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత చెప్పారు.